![]() |
![]() |

బిగ్ బాస్ (Bigg Boss) షోకి ఎంత క్రేజ్ ఉందో.. కాంట్రవర్సీలు కూడా దాని చుట్టూ అదే స్థాయిలో ఉంటాయి. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఈ షో ఉండదని.. ఇందులోని కంటెస్టెంట్ లు హద్దుమీరి ప్రవర్తిస్తుంటారని, అందుకే ఇలాంటి షోలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసేవారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా హిందీ బిగ్ బాస్ పై ఇటువంటి విమర్శలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు బెడ్ మీద రొమాన్స్ చేసుకుంటున్న వీడియో లీక్ కావడం సంచలనంగా మారింది.
ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్-3 నడుస్తోంది. ఓటీటీ వేదిక జియో సినిమాలో ప్రసారమవుతున్న ఈ షోని పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్న అర్మాన్ మాలిక్ (Armaan Malik).. తన రెండో భార్య కృతిక తో రొమాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో షో నిర్వాహకులపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రియాలిటీ షో పేరుతో ఇదా మీరు చేసేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాయి. బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే జియో సినిమా మాత్రం తమకేం పాపం తెలీదని, ఇది ఫేక్ వీడియో అని అంటోంది. తమ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేసే కంటెంట్ విషయంలో ఖచ్చితమైన ప్రమాణాలు పాటిస్తామని, బిగ్ బాస్ లో ఎటువంటి అశ్లీల కంటెంట్ లేదని తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఎవరో మార్ఫ్ చేశారని.. వారు ఎవరో గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జియో పేర్కొంది.
![]() |
![]() |